అశ్వద్ధామ:రివ్యూ

- January 31, 2020 , by Maagulf
అశ్వద్ధామ:రివ్యూ

యువ హీరో నాగ శౌర్య, మెహ్రీన్ కౌర్ జంటగా రమణ తేజ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా అశ్వద్ధామ. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవర్ బోయ్ ఇమేజ్ నుండి మాస్ హీరోగా ప్రమోట్ అయ్యేందుకు నాగ శౌర్య చేసిన ప్రయత్నం ఎంతవరకు ఫలించింది.. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్ష లో చూద్దాం.


కథ :

వైజాగ్ లో ఫ్యామిలీతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న గణ (నాగ శౌర్య) ఎంగేజ్మెంట్ అయిన చెల్లి ప్రెగ్నెంట్ అని తెలిసి షాక్ అవుతాడు. అందుకు కారణమైన వ్యక్తుల గురించి ఆరా తీస్తాడు. అయితే ఈ క్రమంలో తన సోదరి మాత్రమే కాదు ఇలా వాళ్ల ప్రమేయం లేకుండానే ఒక గ్యాంగ్ చేతిలో ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల మీద ఫోకస్ పెడతాడు. విలన్ గ్యాంగ్ మీద గురి పెట్టిన గణ వారిని ఎలా కనిపెట్టాడు. వారి పని ఎలా పట్టాడు అన్నది సినిమా కథ.


విశ్లేషణ :

యువ హీరోగా ఉన్న నాగ శౌర్య మాస్ ఇమేజ్ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమా కథను నాగ శౌర్య అందించడం విశేషం. సినిమా దర్శకుడు రమణ తేజ మొదటి భాగం స్లో గా నడిపించాడు. సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అని చెప్పొచ్చు. సినిమా స్టోరీ రొటీన్ గా అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.


నాగ శౌర్య పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాలో అతని యాక్షన్ సీన్స్ ఇంప్రెస్ చేస్తాయి. అయితే తెలుగులో ఆల్రెడీ వచ్చిన సినిమాగా అశ్వద్ధామలో కొత్తదనం లేదని చెప్పొచ్చు. సబ్జెక్ట్ ప్రకారం స్క్రీన్ ప్లే కూడా మ్యాచ్ అయ్యేలా చేసినా యాక్షన్ సీన్స్ ముందు వచ్చే లీడ్ సీన్స్ సరిగా రాసుకోలేదని చెప్పొచ్చు.


సినిమా చూస్తున్నంత సేపు పర్వాలేదు అనిపించినా ఏదో మిస్సైనట్టు అనిపిస్తుంది. సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఒకసారి చూసేలా ఉంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేరే రేంజ్ లో ఉండేదని చెప్పొచ్చు.


నటీనటుల ప్రతిభ :

గణ పాత్రలో నాగ శౌర్య పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడు నాగ శౌర్య. తనకు ఉన్న లవర్ బోయ్ ఇమేజ్ నుండి మాస్ ఇమేజ్ తెచ్చుకునేందుకు నాగ శౌర్య బాగా కష్టపడుతున్నాడని చెప్పొచ్చు. ఇక మెహ్రీన్ కౌర్ తన రెగ్యులర్ సినిమాల మాదిరిగానే ఓ మోస్తారుగా నటించింది. శౌర్య, మెహ్రీన్ పెయిర్ బాగుంది. సినిమాలో జిస్సుసే గుప్తా విలనిజం బాగుంది. సైకో విలన్ గా అతను మెప్పించాడు. పోసాని కృష్ణమురళి ఆకట్టుకున్నాడు. నాగ శౌర్య సిస్టర్ పాత్ర చేసిన ప్రియ నటన బాగుంది. మిగతావారంగా కూడా పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


సాకేతికవర్గం పనితీరు :


మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ లో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాకు మ్యూజిక్ అందించిన శ్రీ చరణ్ జస్ట్ ఓకే అనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరో నాగ శౌర్య కథ బాగా రాసుకున్నాడు. అయితే ఆలోచన బాగున్నా దాన్ని తెరకెక్కించడంలో కొద్దిగా తడపడ్డారు. రమణ తేజ డైరక్షన్ టాలెంట్ ఓకే అనేలా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంతా పెట్టారు.


ప్లస్ పాయింట్స్ :


నాగ శౌర్య


సినిమాటోగ్రఫీ


యాక్షన్ సీన్స్


మైనస్ పాయింట్స్ :


ఫస్ట్ హాఫ్


మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్


చివరిగా  :


అశ్వద్ధామ.. ఓన్లీ ఫర్ నాగ శౌర్య యాక్షన్..!


మాగల్ఫ్ రేటింగ్ : 2.25/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com