నిర్భయ కేసులో ట్విస్ట్..
- January 31, 2020
న్యూ ఢిల్లీ:నిర్భయ కేసులో మళ్లీ ట్విస్ట్ ఎదురైంది. నిర్భయ దోషుల ఉరి రోజుకో మలుపు తిరుగుతోంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి మూడు రోజుల కిందే తిరస్కరించారు. దీంతో ఆ దోషులను శనివారం ఉరి తీయడం దాదాపు ఖాయమనే అనుకున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా అయ్యాయి. తలారి సైతం తీహార్ జైలుకు చేరుకున్నారు. ఉదయం నలుగురుకీ ఉరిశిక్ష ఖాయం అనుకున్నారు అంతా.. అయితే రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుతూ వినయ్ శర్మ పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఆ పిటీషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. వినయ్ శర్మ పిటీషన్ పెండింగ్‌లో ఉన్నందున అతడి ఉరి శిక్ష వాయిదా పడుతుందని తీహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ అన్నారు. ఇందులో వేరే ఉద్దేశమేది లేదని ఆయన అన్నారు. కాగా.. మిగతా దోషులను ముందు అనుకున్నట్లుగానే జైలు అధికారులు ఉరి తీస్తారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!