కరోనా వైరస్‌తో స్కూళ్ళు మూతపడలేదు
- January 31, 2020
యూ.ఏ.ఈ:ఫిబ్రవరి 2 నుంచి కొన్ని స్కూళ్ళు కరోనా వైరస్ తీవ్రత కారణంగా మూతపడనున్నట్లు సర్క్యులేట్ అవుతున్న వార్తలో నిజం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా యూఏఈలోకి వైరస్ ప్రవేశించిందనీ, దాంతో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారనీ ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!