ఖతార్:సీలైన్ పెట్రో స్టేషన్ ప్రారంభించిన వోఖోడ్
- February 01, 2020
ఖతార్ పెట్రో సంస్థ వోఖోడ్ కొత్త సీలైన్ పెట్రో స్టేషన్ ను ప్రారంభించింది. దీంతో ఖతార్ లో వోఖోడ్ సంస్థకు చెందిన ఫిక్స్ డ్, మొబైల్ పెట్రో స్టేషన్ ల సంఖ్య 103కు పెరిగింది.ఈ సందర్భంగా సంస్థ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రషీద్ అల్ ముహన్నది మట్లాడుతూ ' సీలైన్ లో కొత్తగా ఫిక్స్ డ్ పెట్రోల్ స్టేషన్ ప్రారంభించటం సంతోషంగా ఉంది. దేశంలో పెట్రో ఉత్పత్తులకు నెలకొన్న డిమాండ్ ను చేరుకునేలా పెట్రోల్ స్టేషన్ నెట్వర్క్ పెంపొందించుకోవటమే లక్ష్యంగా సంస్థను విస్తరించాలన్నది వోఖోడ్ లక్ష్యం. వినియోగదారులకు బెస్ట్ సర్వీస్ అందించాలన్నది మా సంకల్పం' అని అన్నారు. వాఖుద్ విస్తరణకు తోడ్పాటు అందించని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు వోఖోడ్ కృతజ్ఞతలు తెలిపింది. మొత్తం 12,000 చదరపు స్క్వైర్ మీటర్లలో సీలైన్ పెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇందులోని మూడు లేన్లలో రెండు లైట్ వెహికిల్స్ కు కేటాయించగా..మరో లేన్ భారీ వాహనాలకు ఫిల్లింగ్ స్టేషన్లుగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?