కరోనా అలర్ట్ :వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన WHO
- February 01, 2020
చైనా నుంచి ప్రపంచ దేశాలకు ర్యాపిడ్ గా విస్తరిస్తున్న కరోనా వైరస్ పట్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తం అయ్యింది. అంతకంతకూ విస్తరణకు కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటివరకు భారత్ తో 20 దేశాలకు వైరస్ విస్తరించినట్లు WHO తెలిపింది. దీంతో అయా దేశాలకు వైరస్ ను అరికట్టేందుకు సత్వరమే తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రపంచ దేశాలు సంయుక్తంగా పోరాడేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రకటించింది. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుతో పాటు సరపడా కరోనా కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. కరోనా ధాటికి చైనాలో ఇప్పటికే 213 మంది చనిపోగా..ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి వైరస్ సోకంది. ఇదంతా కేవలం రెండు వారాల వ్యవధిలో జరిగింది. దీంతో వైరస్ తీవ్రతను అసాధారణ పరిస్థితులుగా గుర్తిస్తూ WHO వర్లడ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇక లేటెస్ట్ గా బ్రిటన్ లో కూడా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







