హైకింగ్‌ చేస్తూ గాయపడ్డ మహిళను రక్షించిన పిఎసిడిఎ

- February 01, 2020 , by Maagulf
హైకింగ్‌ చేస్తూ గాయపడ్డ మహిళను రక్షించిన పిఎసిడిఎ

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ (పిఎసిడిఎ), ఓ వలస మహిళ హైకింగ్‌ చేస్తుండగా గాయపడ్డంతో ఆమెను రక్షించడం జరిగింది. ఈ ఘటన మస్కట్‌ గవర్నరేట్‌లోని అల్‌ అమెరాత్‌ మౌంటెయిన్స్‌లో చోటు చేసుకుంది. పిఎసిడిఎ టీమ్‌, స్థానిక పోలీసులతో కలిసి, బాధితురాలికి సాయం అందించినట్లు పేర్కొన్నారు. మస్కట్‌ గవర్నరేట్‌లోని విలాయత్‌ ఆఫ్‌ అల్‌ అమెరాత్‌లోని ఓ మౌంటెయిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. బాధితురాలికి అత్యవసర వైద్యం అందించి, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే వుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com