యూఏఈకి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సముద్ర పెహెరెదర్
- February 03, 2020
దుబాయ్:భారత కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) సముద్ర పెహెరదర్, యూఏఈకి చేరుకుంది. మినా రషిద్‌లో ఈ షిప్ డాక్ అయి వుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్‌లో భాగంగా ఈ షిప్ యూఏఈకి చేరుకోవడం జరిగింది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని ఈ తరహా కార్యక్రమాలు మరింత పటిష్టం చేసేందుకు ఉపకరిస్తాయని ఇరు దేశాల ప్రతినిథులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిసి) అలాగే యూఏఈ మెరిటైమ్ ఏజెన్సీస్ సంయుక్తంగా పలు కార్యక్రమాల్ని ఇప్పటికే చేపట్టాయి. కాగా, ఐసిజిఎస్ సముద్ర పెహెరెదర్, పొల్యూషన్ కంట్రోల్ వెజెల్ కేటగిరీలో భారతదేశానికి చెందిన రెండవ నౌక. 2010లో ఈ నౌకని కమిషన్ చేశారు. సూరత్‌లోని ఎబిజి షిప్‌యార్డ్‌లో దీన్ని తయారు చేశారు. 20 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే ఈ నౌక వుండగలదు.ఈ షిప్ కి అన్వర్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!