54,000 దిర్హామ్‌లు సేకరించిన గర్ల్‌ గైడ్స్‌

- February 03, 2020 , by Maagulf
54,000 దిర్హామ్‌లు సేకరించిన గర్ల్‌ గైడ్స్‌

షార్జా గర్ల్‌ గైడ్స్‌ (ఎస్‌జిజి), చాకొలెట్‌ చిప్‌, ఓట్‌ మరియు పీనట్‌ బటర్‌ కుకీస్‌ని విక్రయించడం ద్వారా 54,000 దిర్హామ్‌లు సేకరించారు. ఈ మొత్తాన్ని ప్రిజనర్స్‌ డెబిట్స్‌ని చెల్లించడానికి వినియోగిస్తారు. ఫరాజ్‌ ఫండ్‌తో కలిసి ఎస్‌సిజి ఈ ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌ని 'కుకీస్‌ ఫర్‌ ఎ కాజ్‌' పేరుతో చేపట్టారు. గత ఏడాది ఈ ప్రోగ్రామ్‌ ద్వారా వచ్చిన సొమ్ము కంటే రెట్టింపు సొమ్ముని ఈ ఏడాది సేకరించడం జరిగింది. 54 ఎస్‌జిజి బ్రౌనీస్‌ (7-11 ఏళ్ళు), గైడ్స్‌ (12 నుంచి 15 ఏళ్ళు), ఈ కుకీస్‌ని విక్రయించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com