షార్జాలోని స్కూల్‌ క్యాంటీన్స్‌లో తనిఖీలు

- February 03, 2020 , by Maagulf
షార్జాలోని స్కూల్‌ క్యాంటీన్స్‌లో తనిఖీలు

షార్జా మునిసిపాలిటీ, స్కూల్‌ క్యాంటీన్స్‌లో తనిఖీలు చేపడుతోంది. ఫుడ్‌ సేఫ్టీ అలాగే ఒబెసిటీ వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ తనఖీల్ని చేపడుతున్నారు. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ అమాల్‌ అల్‌ షామ్సి మాట్లాడుతూ, స్కూల్‌ క్యాంటీన్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత వంటి విషయాల్ని ఈ తనిఖీల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 2019లో మొత్తం 34,000 తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాలు తయారు చేసే విధానం దగ్గర్నుంచి, వాటిని భద్ర పరచడం, రవాణా చేయడం వంటి విషయాల్నీ పరిశీలిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com