కరోనా ఎఫెక్ట్ : ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష

- February 04, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్ : ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష

కువైట్:కరోనా వైరస్ పై తెలిసితెలియక జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు కువైట్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక నుంచి వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీనిపై ఎవరు కంప్లైంట్ చేయకున్నా..సుమోటోగా కేసు నమోదు చేసి జైలు పంపించే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తుచేశారు. దాదాపు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాప్తిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కువైట్ లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వైరస్ తో కొందరు ఇప్పటికే ఆస్పత్రి పాలయ్యారని కొన్ని అకౌంట్లలో కనిపించగా...వైరస్ అతి సాధరణమైనదనే తరహాలో మరికొన్ని అకౌంట్లలో పోస్టింగ్ లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్ పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా లేదా వారిని అయోమయానికి గురిచేసే విధంగా జరుగుతున్న ఈ ఫేక్ న్యూస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com