మస్కట్: ఓపెన్ ప్లేస్, పబ్లిక్ ప్లేసుల్లో చెత్త వేస్తే OMR 1,000 ఫైన్

- February 04, 2020 , by Maagulf
మస్కట్: ఓపెన్ ప్లేస్, పబ్లిక్ ప్లేసుల్లో చెత్త వేస్తే OMR 1,000 ఫైన్

మస్కట్ ను క్లీన్ సిటీగా మెయిన్టేన్ చేసేందుకు సిటీ మున్సిపాలిటీ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఓపెన్ ప్లెస్, పబ్లిక్ ప్లేస్ లలో చెత్త వేయకూడదని తెలిపింది. మున్సిపాలిటీ మార్గదర్శకాలు, నిబంధలకు విరుద్ధంగా ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్ వంటి గార్బేజ్ ను పడేస్తే OMR 1,000 వరకు ఫైన్ విధిస్తామని గుర్తు చేసింది. టూరిస్ట్ స్పాట్స్, పార్క్స్ లపై మరింత ఫోకస్ చేయనుంది. పబ్లిక్ ప్లేసెస్ లో వేస్టేజ్ ను పడేసే వారికి గతంలోనూ మస్కట్ మున్సిపాలిటీ అధికారులు ఫైన్ విధించారు. అయితే..కొన్నాళ్లు జనాల్లో అవేర్నెస్ ఉన్నా..ఇటీవలి కాలంలో మళ్లీ వేస్టేజ్ ను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ వస్తున్నారు. వ్యర్థాలను పడేసేందుకు సపరేట్ గా డస్ట్ బిన్స్ తో పాటు పర్టిక్యూలర్ ప్లేసులను కేటాయించినా..జనాలు మాత్రం వాటిని వినియోగించుకోవటంతో లేదు. మరీ ముఖ్యంగా సెలవు రోజుల్లో మున్సిపాలిటీ నిబంధనల ఉల్లంఘన మరింత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో టూరిస్ట్ స్పాట్స్, పార్క్స్ చూడటానికి అసహ్యంగా, టూరిస్టులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్న ఘటనలను కూడా గుర్తించామని అధికారులు చెబుతున్నారు. అమ్యూజ్ మెంట్ పార్కుల్లో చైల్డ్ రైడ్స్ ని డ్యామేజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మస్కట్ మున్సిపాలిటీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పబ్లిక్ ప్లేసుల్లో చెత్త వేసే వారికి OMR 1,000 ఫైన్ వేస్తామని..ఒకవేళ మళ్లీ రిపీట్ అయితే ఫైన్ మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com