బహ్రెయిన్:కరోనా భయంతో ఫేస్ మాస్క్స్ కు ఫుల్ డిమాండ్
- February 04, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ ఫార్మా స్టోర్స్ కి కలిసొచ్చింది. వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో తమ వరకు వైరస్ రాకుండా జనం ముందుజాగ్రతలు తీసుకుంటున్నారు. దీంతో బహ్రెయిన్ వ్యాప్తంగా ఇప్పుడు ఫేస్ మాస్క్స్ కు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఫార్మా స్టోర్స్ లో స్టాక్ మొత్తం ఖాళీ అయ్యింది. కింగ్ డమ్ డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతున్నా..అందుకు తగినట్లు సప్లై లేదు. పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఫార్మా స్టోర్ యజమాని మాట్లాడుతూ ఫేస్ మాస్క్స్ కి కొరత తీవ్రంగా ఉందని, తమ దగ్గర ఉన్న స్టాక్ కేవలం రెండు రోజుల్లోనే అమ్ముడుపోయిందని వివరించారు. ప్రస్తుతానికి బహ్రెయిన్ ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకున్నా..జనంలో వైరస్ పై అవేర్ నెస్ నెలకొనటంతో ముందస్తుగా ఫేస్ మాస్క్స్ ధరిస్తున్నారని అన్నారు. అయితే..ఫేస్ మాస్క్స్ ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుండటం కూడా బహ్రెయిన్ లో కొరత ఎర్పడటానికి ఓ కారణం అవుతోంది. చైనాలో కరోనా కలకలంతో ఫేస్ మాస్క్స్ కు డిమాండ్ పెరిగింది. దీంతో బహ్రెయిన్ కి దిగుమతి భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే బహ్రెయిన్ ఫార్మా స్టోర్స్ కు డిమాండ్ తగినంత మాస్క్స్ సప్లై కావటం లేదు. అయితే..కేవలం ఫేస్ మాస్క్స్ ధరించటం వల్ల చెప్పుదగిన పరిష్కార మార్గం కాదని కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదిలాఉంటే..కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు 300 మంది వరకు చనిపోగా, 14,500 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు వైరస్ విస్తరించింది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు చైనాలో రవాణా అంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!