అబుదాబి: భారీ గ్యాస్ నిక్షేపాన్ని గుర్తించిన యూఏఈ

- February 04, 2020 , by Maagulf
అబుదాబి: భారీ గ్యాస్ నిక్షేపాన్ని గుర్తించిన యూఏఈ

OPEC దేశాల్లో అతి పెద్ద ఎగుమతిదారుగా ఉన్న యూఏఈ భారీ గ్యాస్ నిక్షేపాన్ని గుర్తించినట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాలకు సరిపడేంత మేర గ్యాస్ నిక్షేపం విస్తరించి ఉన్నట్లు తెలిపింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కో - ADNOC తెలిపిన వివరాల ప్రకారం  దుబాయ్, అబుదాబి మధ్య ప్రాంతంలో 80 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల షాలో గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు. ఈ కొత్త గ్యాస్ నిక్షేపం ద్వారా గ్యాస్ స్వయం సమృద్ధిని సాధించాలనుకుంటున్న అబుదాబి లక్ష్యం నెరవేరబోతోంది. అలాగే భారీ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు దోహదం జరుగుతుందనే అభిప్రాయంతో ఉంది. గ్యాస్ నిక్షేపాల్లో తవ్వకాలు, పంపకాలకు సంబంధించి ADNOC, దుబాయ్ సప్లై అథారిటీ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ & డెవలప్మెంట్ ఆఫ్ ది గ్యాస్ రీసోర్సెస్ మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి. ప్రస్తుతం గుర్తించిన గ్యాస్ నిక్షేపాలు తక్కువ లోతులోనే ఉండటం మరింత ప్రయోజనం చేకూర్చే అంశం. అయితే.. ప్రొడక్షన్ కు మాత్రం అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ గ్యాస్ నిక్షేపం నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ను ఎక్కువగా దుబాయ్ కి సప్లై చేయనున్నారు. ప్రస్తుతం ఖతార్ నుంచి దుబాయ్ కి గ్యాస్ సప్లై అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com