నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

- February 04, 2020 , by Maagulf
నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: స్పైస్ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ కేంద్రంగా స్పైస్ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని చెప్పారు. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కార్యాలయం పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయన్నారు. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పని చేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు బోర్డు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com