రన్ వే పైనుంచి రోడ్డు మీదికి దూసుకొచ్చిన విమానం

- February 06, 2020 , by Maagulf
రన్ వే పైనుంచి రోడ్డు మీదికి దూసుకొచ్చిన విమానం

టర్కీ:టర్కీలో విమానం రన్ వే నుంచి రహదారిపైకి దూసుకెళ్లింది. ఇస్తాంబుల్ సబీహ విమానాశ్రయంలో ఘటన జరిగింది. పెగాసస్ విమానయాన సంస్థకు చెందిన ప్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. రహదారిపైకి దూసుకెళ్లిన విమానం మూడు ముక్కలైంంది. విమానం కుదుపునకు గురవడంతో అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. మరో 179 మంది గాయపడ్డారు.

ప్రమాదంలో తీవ్రగాయలైన ముగ్గురు చనిపోయారని టర్కీ రవాణాశాఖ మంత్రి మెహ్మెత్ పేర్కొన్నారు. గాయాలైన వారి పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. విమానం మూడు ముక్కలు అవడంతో.. అందుల్లోంచి ప్రయాణికులు వచ్చినట్టు తెలుస్తోంది. రన్ వేపై ప్రమాదం నేపథ్యంలో.. ఇతర విమానాల రాకను నిలిపివేసినట్టు మంత్రి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి 183 మందితో విమానం బయల్దేరిందని పేర్కొన్నారు.

177 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిసి ఇజ్మిర్ నుంచి విమానం బయల్దేరిందని ఇస్తాంబుల్ గవర్నర్ అలి యెర్లికయ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులకు 18 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితులు బాగోలేదని, అందుకే అదుపుతప్పి పోయి ఉంటుందని తెలిపారు. రన్ వే నుంచి 60 మీటర్ల వరకు రోడ్డుపైకి రావడంతో ప్రమాదం జరిగిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com