సంగీతోత్సవం: మార్చి 27న యూఏఈలో ఇళయరాజా ‘ఇసై రాజంగం’
- February 06, 2020
దుబాయ్: సినీ సంగీత ప్రపంచంలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయనే పద్మ విభూషణ్, పద్మ భూషణ్ ఇళయరాజా. ‘మేస్ట్రో’గా భారత సినీ సంగీత ప్రపంచంలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1978లో ‘అన్నాకిలి’ అనే సినిమాతో సినీ సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇళయరాజా. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో అవార్డులు, ఎన్నెన్నో ప్రశంసలు ఆయన సొంతం చేసుకున్నారు. ఐదు సార్లు ఇళయరాజా జాతీయ అవార్డుని అందుకున్నారంటే ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ‘సైకో’ చిత్రానికి ఆయన సంగీతం అందించారు.
16 ఏళ్ళ తర్వాత యూఏఈ లో:
ఇళయరాజా, 16 ఏళ్ళ తర్వాత యూఏఈకి ‘ఇసై రాజంగం’ కోసం విచ్చేస్తున్నారు. మార్చి 27న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇళయరాజా 44 ఏళ్ల సినీ సంగీత ప్రస్థానాన్ని ఇక్కడ వీక్షించేందుకు అవకాశమేర్పడుతోంది. షార్జా క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ కార్యక్రమానికి విశేష అతిథి గా హాజరవుతారు. హాల్స్ స్టూడియోస్, అభిషేక్ ఫిలింస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రముఖ గాయకులు బాలసుబ్రమణ్యం, హరిహరన్, మనో, మదుబాలా క్రిష్ణన్, ముఖేష్, శ్వేతా మోహన్, సుర్ముగి, ఉషా ఉతుప్, అనితా కార్తికేయన్, ప్రియా హిమేష్, విభావరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మోషన్ పోస్టర్ ఆవిష్కరణ:
ఈ సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో ఇళయరాజా దుబాయ్ విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మోషన్ పోస్టర్ ను కార్యక్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు. ‘ఇసై రాజంగం’ కు Club FM, Radio Gilli 106.5 FM మీడియా పార్టనర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈవెంట్ కి టిక్కెట్ల కొరకు http://isairajangam.com/ చూడగలరు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!