సివిల్‌ ఐడీ దుర్వినియోగం: నిందితురాలి కోసం వెతుకుతున్న పోలీసులు

- February 06, 2020 , by Maagulf
సివిల్‌ ఐడీ దుర్వినియోగం: నిందితురాలి కోసం వెతుకుతున్న పోలీసులు

కువైట్‌ సిటీ: పోలీసులు, ఓ నిందితురాలి కోసం వెతుకుతున్నారు. కువైటీ మహిళ ఐడీని దొంగిలించిన మరో మహిళ, ఆ సివిల్‌ ఐడీ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కేసు వివరాల్లోకి వెళితే, కువైటీ మహిళ పేరుతో కొన్ని టెలిఫోన్‌ లైన్స్‌ కొనుగోలు చేశారు. ఆ విషయం బాధిత మహిళకు తెలియకుండా జరిగింది. అయితే, ఆ వ్యవహారాలకు సంబంధించి బాధితురాలికి నోటీసులు రాగా, ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. షామియా పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, ఆ కేసు సల్వా పోలీస్‌ స్టేషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది. విచారణలో బాధితురాలి ఐడీ మిస్‌ అయినట్లు తేలింది. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com