అలెర్ట్..అలెర్ట్! యూఏఈ లో మరో రెండు కరోనావైరస్ కేసులు
- February 08, 2020
యూఏఈ: కరోనావైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కొత్త కేసులను యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకి చేరుకుంది. తాజాగా వైరస్ సోకివారిలో ఒకరు ఫిలిపినో (మొదటి నాన్ - చైనీస్ వ్యక్తి) మరొకరు చైనీస్ గా గుర్తించారు.
కరోనావైరస్ సంక్రమించే ప్రమాదం ఉన్న రోగులను గుర్తించడానికి ‘ప్రిడిక్టివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్’ ను గత వారం ప్రారంభించినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (వారీద్ సిస్టమ్) ను అన్ని హాస్పిటల్స్ లో పొందుపరచటం జరిగిందని తద్వారా కరోనావైరస్ సంక్రమణను పొందే ప్రమాదం ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించడానికి సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనావైరస్ నుండి దేశాన్ని రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యగా యూఏఈ ఆరోగ్య అధికారుల సహకారంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!