పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం..బహిరంగంగా ఉరి

- February 09, 2020 , by Maagulf
పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం..బహిరంగంగా ఉరి

ఇమ్రాన్ ఖాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలపై అత్యాచారం, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పాకిస్థాన్‌లోని నౌషెరా ప్రాంతంలో 2018లో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేయడమే కాకుండా హత్య చేసిన ఘటన అక్కడ సంచలనం సృష్టించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్‌ ఖాన్‌ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com