ఏప్రిల్ నుంచి రాజకీయాల్లోకి కబాలి

- February 09, 2020 , by Maagulf
ఏప్రిల్ నుంచి రాజకీయాల్లోకి కబాలి

శివాజీ రాజ్ గైక్వాడ్.. అలియాస్ రజనీకాంత్(69).. 22ఏళ్ల నిరీక్షణ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ పక్కా చేశాడు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన రజనీ.. 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి వస్తానని అనౌన్స్ చేసినప్పటికీ ఇన్నాళ్లకు పక్కా చేశాడు.

రజనీ మక్కల్ మంద్రంను లాంచ్ చేసి అఫీషియల్‌గా ఏప్రిల్ నుంచి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14 తర్వాత ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చని వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా మంది రజనీకాంత్.. బీజేపీ వల్ల ప్రభావితమయ్యారని, అంతేకాకుండా చెన్నైలో ఉన్న ఆర్ఎస్ఎస్ లీడర్ ఎస్ గురుమూర్తి ప్రభావం కూడాఉందని అంటున్నారు.

అదే సమయంలో రజనీకి సలహాదారుగా, రాజకీయ విశ్లేషకుడిగా రొటీన్ ఎఫైర్స్ చూసుకునే పదవిలో తమిళరువి మణియన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు మణియన్ మాట్లాడుతూ.. రజినీకాంత్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది స్పష్టత లేదన్నారు. 'బీజేపీతో ఒప్పందం కుదుర్చుకోవడమేనది రజనీకాంత్ స్వయంగా నిర్ణయించుకోవాలి. కానీ, దినకరన్‌తో సంధి చేసుకోవడం నెగెటివ్ ప్రభావం తీసుకొచ్చేలా ఉంద'ని చెప్పారు.

రజినీకాంత్‌కు బీజేపీ సహాయం కచ్చితంగా ఉంటుందని కొన్ని వర్గాలు చెప్పుకొస్తున్నాయి. 'నేరుగా ఒప్పందం కుదుర్చుకున్నా.. లేకున్నా.. కచ్చితంగా రజినీకి సహాయం అందిస్తుంది' అని అంటున్నాయి. డేట్ ఇంకా పక్కా కాలేదు. కానీ, మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్టీ సమావేశం ప్రకటిస్తారని అన్నారు.

మణియన్ మాట్లాడుతూ.. డీఎంకే, ఏఐఏడీఎంకైలపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని.. రజనీకి అనుకూలంగానే వాతావరణం కనిపిస్తుందని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com