ఉగాది కానుకగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'

- February 09, 2020 , by Maagulf
ఉగాది కానుకగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'

ఏడడుగులు ఎప్పుడైనా నడవాల్సిందే కదా!! అందుకే.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'గా తొలి అడుగువేశారు అక్కనేని హీరో అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అఖిల్ నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'గా ఏడు అడుగుల్లో నా మొదటి అడుగు ఇదిగో.. ఏప్రిల్‌లో థియేటర్స్‌లో కలుసుకుందాం' అంటూ ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు అఖిల్. విదేశీ రోడ్లపై నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్న అఖిల్ లుక్ కాస్త కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉంది. మరి మనోడి అడుగులు విజయ తీరానికి తీరుస్తాయో లేదో కాని.. ఫస్ట్ లుక్‌తో ఇంప్రెషన్ రాబట్టారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మలు నిర్మిస్తున్నారు. ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్ , గెటెప్ శ్రీనులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాలతో సరైన హిట్ కొట్టలేకపోయిన అఖిల్.. ఈసారి బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి పెద్ద హిట్ కొట్టేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com