మస్కట్:పెరిగిన సాలిడ్ వేస్ట్...పెద్ద చెత్త డబ్బాలు పంపిణీకి రంగం సిద్ధం
- February 11, 2020
మస్కట్ లో రోజురోజుకి సాలిడ్ వేస్ట్ పెరిగిపోతోంది. గత ఏడాది ఏకంగా 4,33,328 టన్నుల వ్యర్ధాలను సేకరించినట్లు ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ హోల్డింగ్ కంపెనీ (Be’ah) వెల్లడించింది. దీంతో స్ట్రీట్స్ లో ప్రస్తుతం ఏర్పాటు చేసిన గార్బేజ్ బిన్స్ ను తొలగించాలని వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ Be’ah నిర్ణయించింది. వాటి స్థానంలో ప్రత్యేకంగా రూపొందించిన గార్బేజ్ బిన్స్ ను ఏర్పాటు చేయనుంది. సీబ్ లో విలాయత్ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు..వచ్చే వారం నుంచి వేస్టేజ్ ను నేరుగా ఇళ్ల దగ్గర్నుంచే
కలెక్ట్ చేయనున్నట్లు Be’ah సంస్థ అధికారులు తెలిపారు. గతంలో తాము పంపిణీ చేసిన చెత్త కుండీలు చాలా చిన్నగా ఉన్నాయని, అవి వేస్టేజ్ వేయటానికి సరిపోవటం లేదని సీబ్ రెసిడెన్సీస్ నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని కంపెనీ వెల్లడించింది. కుండీలు సరిపోకపోవటంతో గ్రీన్ వేస్టేజ్, ఫర్నీచర్ వంటి వేస్టేజ్ ను బయట వేయాల్సి వస్తోందని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయని వివరించింది. దీంతో వేస్టేజ్ సేకరణ ప్రణాళికలో మార్పులు చేసుకుంది. 241 lt చిన్న బిన్స్ స్థానంలో 1,100 lt గార్బెజ్ బిన్స్ సప్లై చేయనున్నారు. అవసరమైన చోట్ల 2,400 lt వరకు ఉండే గార్బేజ్ బిన్స్ కూడా పంపిణీ చేస్తామని Be’ah తెలిపింది. అయితే..బిగ్ వేస్టేజ్ ను చెత్త కుండీల వెలుపల వేయరాదని కూడా సూచించింది. అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1881 ద్వారా తమను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!