బహ్రెయిన్:రాయల్ గార్డ్ లో న్యూ మిలటరీ సిస్టమ్ ప్రారంభం

- February 11, 2020 , by Maagulf
బహ్రెయిన్:రాయల్ గార్డ్ లో న్యూ మిలటరీ సిస్టమ్ ప్రారంభం

బహ్రెయిన్:రాయల్ గార్డ్ లో అధునాధన మిలటరీ సిస్టం, లాంచర్స్ అండ్ మోటర్ సిస్టమ్ ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మేజర్ జనరల్ షేక్ నాస్సెర్  ప్రారంభించారు. 52వ బహ్రెయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ డే వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాయల్ గార్డ్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా హజరయ్యారు. ఈ సందర్భంగా రాయల్ గార్డ్ లో న్యూ బిల్డింగ్, మిలిట్రి సిస్టమ్ అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధునాతన సిస్టమ్ తో మిలటరీకి అప్ డేట్ టెక్నాలజీ సమకూరిందని మేజర్ జనరల్ షేక్ నాస్సెర్ వెల్లడించారు. దీంతో భద్రత బలగాలు తమకు అప్పగించిన టాస్క్ ను అక్యూరేట్ గా సాధించగలరని వివరించారు. పోరాట సమర్ధత, అడ్మినిస్ట్రేటీవ్ సంసిద్దత కోసం అఫీసర్స్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com