యూఏఈ: స్టూడెంట్స్ కు 6 నెలల యూఏఈ వీసా నిబంధనల నుంచి మినహాయింపు

- February 13, 2020 , by Maagulf
యూఏఈ: స్టూడెంట్స్ కు 6 నెలల యూఏఈ వీసా నిబంధనల నుంచి మినహాయింపు

స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కు యూఏఈ వీసా నిబంధనల్లో మినహాయింపు ఇస్తున్నట్లు దుబాయ్ లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ - GDRFA స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న యూఏఈ వీసా నిబంధనల ప్రకారం ఏదైనా కారణం చేత ఆరు నెలలకు మించి విదేశాల్లో ఉండే వ్యక్తుల విసాలు అటోమేటిక్ గా టెర్మినేట్ అవుతాయి. అయితే..స్టూడెంట్స్ కు మాత్రం 6 నెలల గడువు విషయంలో మినహాయింపు ఇస్తున్నట్లు GDRFA తెలిపింది. అయితే..స్టడీస్ కోసమే విదేశాల్లో ఉండాల్సి వచ్చినట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఫారెన్ లో ఉండి చదువునే స్టూడెంట్స్ ఒక వేళ పాస్ పోర్ట్ పోగొట్టుకున్నా..ఎవరైనా వారి పాస్ పోర్ట్ దొంగిలించిన ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయంలో సంప్రదించి అవసరమైన ప్రొసిజర్ కంప్లీట్ చేసి కొత్త పాస్ పోర్ట్ పొందవచ్చని చెప్పారు. యూఏఈ ఎంట్రీ అనుమతులకు, న్యూ రెసిడెన్సీ, రెసిడెన్సీ రెన్యూవల్ వంటి సేవలను ఆన్ లైన్ లో పొందటంలో టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారు తమను టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాంటాక్ట్ కావొచ్చని GDRFA డైరెక్టర్ మేజర్ సలేమ్ బిన్ అలీ చెప్పారు. యూఏఈలో ఉన్నవారైతే 8005111 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, విదేశాల్లో ఉండేవారైతే 0097143139999 నెంబర్ ద్వారా తమను సంప్రదించొచ్చన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com