మదీనా: హజ్ యాత్రికుల కోసం రెండు కేర్ సెంటర్లు ప్రారంభం
- February 13, 2020
హజ్ యాత్రికులకు వివిధ సేవలు అందించటంతో పాటు యాత్రను మరింత సులభతరం చేసేలా మినిస్ట్రి ఆఫ్ హజ్ అండ్ ఉమ్ర మదీనాలో రెండు కేర్ సెంటర్లను ప్రారంభించింది. సౌదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030లో భాగంగా ఈ రెండు కేర్ సెంటర్లు హజ్ యాత్రకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలను అందించటంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. అల్ బఖ్ లోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్స్ ఒకే చోట 30 రకాల సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో యాత్రికులు వివిధ అనుమతుల కోసం వేర్వేరు ఆఫీసులు, ఇతర వ్యక్తులను సంప్రదించాల్సిన చికాకులు ఉండవు. హజ్ లేదా ఉమ్రా ప్యాకేజీలోనే 30 రకాల సేవలు పొందవచ్చు. భక్తులు కేర్ సెంటర్స్ లోనే కావాల్సిన పేపర్ వర్క్ ఫినిష్ చేయవచ్చు. ఇందుకు సెల్ఫ్ సర్వీస్ డివైస్ సాయంతోగానీ, కేర్ సెంటర్ స్టాఫ్ సాయం పొందవచ్చు. కేర్ సెంటర్స్ లో పని చేసే స్టాఫ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడగలరు. దీంతో భక్తులకు లాంగ్వేజ్ సమస్య కూడా ఉండదు. వేలిముద్రల ద్వారా కూడా యాత్రికులు తమ డేటా యాక్సెస్ చేసుకొవచ్చని మదీనాలోని పాస్ పోర్ట్ డైరెక్టరేట్ జనరల్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







