వైద్యారోగ్య శాఖలో ఉద్యోగావకాశాలు

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగావకాశాలు

హైదరాబాద్: తెలంగాణలోని మెడికల్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్యారోగ్య శాఖలో మరో 1050 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖల ముఖ్యకార్యదర్శి శాంతికుమారి గురువారం (ఫిబ్రవరి 13న) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానాల సంఖ్యను 118 నుంచి 350కి పెంచుతున్నారు. దీంతో కొత్త పోస్టులు ఏర్పడతాయి. ఆ మేరకు 1050 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. మెడికల్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం.
అర్హత: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌ చదివి ఉండాలి. స్టాఫ్ నర్సు పోస్టులకు జీఎన్ఎం లేక బీఎస్సీ నర్సింగ్, ఒకవేళ రెండు క్వాలిఫికేషన్ ఉన్నవారికి అత్యధిక మార్కులను వెయిటేజీ తీసుకుంటారు. కౌన్సిల్ రిజిస్టేషన్ ఉండాలి. జాబ్ దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.

జీతం: మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.42,000, స్టాఫ్ నర్సులకు రూ.21000 చొప్పున, సహాయక సిబ్బందికి రూ.10,000 చొప్పున చెల్లిస్తారు.

Back to Top