కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్లు

కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్లు

అబుధాబి:చెత్తని వాహనాల్లోంచి నిర్లక్ష్యంగా బయట పారేస్తున్న కేసులు 355 వరకు నమోదయినట్లు అబుధాబి పోలీస్‌ వెల్లడించింది. 2019లో నమోదైన కేసుల సంఖ్య ఇది. ఇలా చేసినవారికి 1,000 దిర్హాముల జరీమానా, అలాగే 6 బ్లాక్‌ పాయింట్స్‌ని విధిస్తారు. రోడ్లపైనా, ఇతర ప్రాంతాల్లోనూ చెత్త పారేయడం పర్యావరణానికి కీడు చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అబుధాబి ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సైఫ్‌ హమాద్‌ అల్‌ జాబి చెప్పారు.

 

Back to Top