వుహాన్: కరోనా వైరస్ కు బలైన ఆస్పత్రి డైరెక్టర్
- February 18, 2020
బీజింగ్ : కరోనా వైరస్ రక్కసి రోజురోజుకూ విజృంభిస్తోంది. చైనా ప్రజలు ఈ వైరస్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు రోజురోజుకూ ఈ వైరస్ భారీన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో చైనా ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటి వరకూ 1868 మంది ప్రాణాలు కోల్పోగా.. 72 వేల మంది కోవిడ్ భారీన పడ్డారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ వైరస్‌ను కనుగొన్న.. ఈ కరోనా భారీన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా సోకడంతో వారు కూడా మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనా వ్యాప్తంగా ఆంక్షలు విధించడం జరిగింది. అంతేకాదు.. అత్యవసరం అయితే తప్ప బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.
తాజాగా.. వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ కూడా ఈ వైరస్‌తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ ఈ వైరస్‌తో మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఝిమింగ్ ఈ ఆస్పత్రికి తొలి డైరెక్టర్. ఇలా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు, డైరెక్టర్‌లే కరోనాతో చనిపోతున్నారంటే.. దాని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. కరోనాను కనుగొన్న వైద్యుడు ఈ వైరస్ భారీన పడి చైనాలోని వూహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!