చైనాకు మెడికల్ సపోర్ట్..8 ఫ్లైట్లలో మెడిసిన్ పంపిస్తున్న ఖతర్
- February 18, 2020
దోహా:కరోనా వైరస్ తో వణికిపోతున్న చైనాకు బాసటగా నిలవాలని ఖతర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఖతార్ నుంచి చైనాకు మెడికల్ సపోర్ట్ అందించనుంది. ఈ నెల 21న 8 ఖతర్ ఎయిర్ వేస్ లో కోవిడ్-19ను ఎదుర్కునేందుకు అవసరమైన మెడిసిన్, మెడికల్ కిట్లను పంపిస్తున్నట్లు ఖతార్ నేషనల్ టూరిజమ్ కౌన్సిల్, ఖతర్ ఎయిర్ లైన్స్ గ్రూప్ జీసీఈవో జనరల్ సెక్రటరీ హెచ్ ఈ అక్బర్ అల్ బకర్ పేర్కొన్నారు. 17వ దోహ జ్యూలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న అక్బర్ అల్ బకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎనిమిది ఫ్లైట్స్ లో రెండింటిని బీజింగ్‌కు, మూడింటిని షాంఘైకి, మిగిలిన మూడు విమానాలు గ్వాంగ్‌జౌకు మెడికల్ కిట్లను తీసుకెళ్తాయని ఆయన చెప్పారు. అన్ని విమానాలు నాలుగు నిమిషాల విరామంలో ఆయా ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ అవుతాయని వెల్లడించారు. కోవిడ్ -19 కారణంగా చైనా ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..తాము మాత్రం చైనా ఫ్లైట్ సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని..ఈ విపత్కర సమయంలో చైనాకు చేయూతగా నిలబడాలని నిర్ణయించినట్లు ఖతార్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







