కళాతపస్వి కె.విశ్వనాధ్ జన్మదినోత్సవం సందర్భంగా 'శివాష్టపది' సంగీత విభావరి

- February 19, 2020 , by Maagulf
కళాతపస్వి కె.విశ్వనాధ్ జన్మదినోత్సవం సందర్భంగా 'శివాష్టపది' సంగీత విభావరి

హైదరాబాద్: "స" అక్షరం సెంటిమెంట్  తో ఎన్నో సంగీత  సాంప్రదాయ  ప్రధాన చిత్రాలను అందించిన  కళాతపస్వి కె.విశ్వనాద్.  ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఈ రోజు బంజారాహిల్స్ లోని లా లిబర్టీ హోటల్ లో " శివాష్టపది" పేరుతో సంగీతావిభవరి నిర్వహించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి శ్రీధర్  ఆధ్వర్యంలో తాడికొండ విజయ కుమార్  సారధ్యంలో  ఈ కార్యక్రమం జరిగింది .ఈసందర్బంగా ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు,స్వరకర్త పార్ధసారధి  , గాయనీ మణులు నిత్య సంతోషిని, గోపిక పూర్ణిమ ల బృంద చే  " శివాష్టపది"  పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. విశ్వనాథ్ ,వేటూరి సుందరరామ్మూర్తి  కాంబినేషన్ లో వచ్చిన అనేక పాటల్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధి గా  ఆంద్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐ. ఏ.ఎస్. ఎల్.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిమాన్షు చౌదరిLl కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు.  అనంతరం కళతాపస్విని ఘనంగా సత్కరించారు. సువర్ణ భూమి అధినేత శ్రీధర్ బొలినేని, సినీ నటులు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రావి కొండలరావు,  సినీ రచయిత జనార్ధన్ మహర్షి అనేకమంది విశ్వనాథ అభిమానులు  సుప్రసిద్ధ  వ్యాఖ్యాత   మడిపల్లి దక్షిణామూర్తి ఈ కార్యక్రానికి సంధాన కర్తగా వ్యవహరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com