భారతీయుడు-2 సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి

- February 20, 2020 , by Maagulf
భారతీయుడు-2 సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం ముగ్గురు మృతి

చెన్నై:ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారతీయుడు-2 సినిమా సెట్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలో బుధవారం రాత్రి 150 అడుగులు గల భారీ క్రేన్‌ కిందపడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.దర్శకుడు శంకర్‌కు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప సవిత ఆస్పత్రికి తరలించారు.ఈ ఘోర ప్రమాదంపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com