దుబాయ్‌ లో 'లవ్ స్టోరీ' షూటింగ్

- February 20, 2020 , by Maagulf
దుబాయ్‌ లో  'లవ్ స్టోరీ' షూటింగ్

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరీ'. నారాయణ్‌ దాస్, పి. రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ దుబాయ్‌లో జరగనుంది. ఈ నెల 21 నుంచి నెలాఖరు వరకూ దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుతారు. ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు నాగచైతన్య. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం: పవన్, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com