అబ్బురపరిచే ట్రంప్ కారు 'ది బీస్ట్' విశేషాలు
- February 20, 2020
న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి కళ్లూ గుజరాత్ వైపే. మొదటి సారిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విశేషమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన రక్షణ దళాలు భారత్‌కు చేరుకుని అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. మరోవైపు మన దేశంలో ట్రంప్ ప్రయాణించేందుకు వాడే కాన్వాయ్ కూడా ఇప్పటికే గుజరాత్‌కు చేరుకుంది. అయితే ట్రంప్ ప్రయాణించే కారు పేరు 'బీస్ట్'. ఇది మాత్రం ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణే. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, అతి సురక్షిత కారు. ఆ కారు విశేషాలు ఒకసారి చూద్దాం....
అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా ఉండేలా రూపొందించారు. ఎంత ఖర్చైనా సరే అమెరికా ప్రభుత్వం వెనకాడటం లేదు. అయితే ట్రంప్ కాన్వాయ్‌లో ఏకంగా 12 బీస్ట్ కార్లుంటాయి. ప్రపంచంలోని ఏ మూలకు ట్రంప్ వెళ్లినా.... ఈ బీస్ట్ కార్లు వెంట నడవాల్సిందే.
బీస్ట్ ఫీచర్లు... మరింత ఆసక్తికరం.
ఈ కారు అద్దాలు 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారైన ఈ కారు ఎలాంటి బాంబ్ పేలుళ్లనైనా తట్టుకుంటుంది. అత్యంత విలాసవంతమైనది. భద్రతాపరంగా శత్రుదుర్బేధ్యంగా ఉంటుంది. ఇక కారు టైర్లు ఎట్టి పరిస్థితుల్లో పంక్చర్ అవకుండా ఉండేలా ఉక్కు కలిపి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టైర్ పేలినప్పటికీ రిమ్తోనూ కారు నడవగలుగుతుంది. బోయింగ్ 757 విమానానికుండే డోర్లు ద బీస్ట్ కారుకు ఉంటాయి.
వాటిలో ఆయుధాలు అమర్చి ఉంటాయి. దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. అవసరమైతే గుళ్ల వర్షాన్ని కురిపిస్తాయి. గ్యాస్, రసాయనాల వంటివి కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలా ఏర్పాటుచేశారు. ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే భాష్పవాయువును ప్రయోగించవచ్చు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నైట్ విజన్ కెమెరాల ద్వారా స్పష్టంగా కనిపించే సదుపాయం కూడా ఉంది.
ఇక డ్రైవర్..సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మాత్రమే ఉంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కారును నడిపేలా శిక్షణ ఇస్తారు. ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలోనూ తిరగగలదు ఈ కారు. డ్రైవర్ కంపార్ట్‌మెంట్‌లో ఉండే జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ..సమాచార కేంద్రానికి అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలందిస్తుంది. నేరుగా వైస్ ప్రెసిడెంట్, పెంటగాన్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు.
అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తం, ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక డీజిల్ ట్యాంక్ ఏ పరిస్థితుల్లోనూ పేలకుండా ఉండేలా ప్రత్యేకమైన రక్షణ కవచం ఉంటుంది. అధ్యక్షుని సీటు వద్దే శాటిలైట్ ఫోన్, అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. ఇక వెనుక భాగంలో అధ్యక్షుడితో పాటు మరో నలుగురు కూడా కూర్చోవచ్చు. లో్పలి భాగం గాజుతో వేరుచేసి ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!