దోహా: ఫిబ్రవరి 21 నుంచి పెరగనున్న మెట్రో టికెట్ల రేట్లు
- February 20, 2020
దోహా మెట్రో టికెట్ల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటివరకు 2QR ఉన్న టికెట్ ధర 3QR కానుంది. అలాగే 6QRగా ఉన్న రోజు వారి పాస్ ధర 10QR కు పెరగనుంది. సింగిల్ జర్నీగోల్డ్ క్లాస్ టికెట్ రేటు 10QR నుంచి 15QR కానుంది. 30QRగా ఉన్న గోల్డ్ క్లాస్ ఒక రోజు పాస్ రేటు ఇక నుంచి 45QRకు పెరగనుంది. ఈ పెరిగిన ధరలు శుక్రవారం(ఫిబ్రవరి 21) నుంచి అమలులోకి రానున్నాయి. పర్యావరణ పరిక్షణ కోసం పేపర్ టికెట్ల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో దోహా మెట్రో అధికారులు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే..గోల్డ్ కప్ ట్రావెల్ కార్డు ధరల్లో మాత్రం ఎలాంటి పెంపు ఉండదని దోహా మెట్రో క్లారిటీ ఇచ్చింది. ఇఫ్పటివరకు ఉన్నట్లుగానే 2QR, రోజువారి పాస్ ధర 10QRగానే ఉంటాయి. ట్రావెల్ కార్డు కావాలనుకునే వారు దోహా మెట్రో స్టేషన్స్ లో తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!