దోహా: ఫిబ్రవరి 25న ఇస్లామిక్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్..ఆర్ధిక గమనంపై చర్చ
- February 20, 2020
దోహ వేదికగా 6వ దోహా ఇస్లామిక్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఈ నెల 25న జరగనుంది. 'ఇస్లామిక్ ఫైనాన్స్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్' అనే టైటిల్ తో జరగనున్న ఈ సదస్సుకు షెరాటన్ దోహా హోటల్ లోని మజ్లిస్ హాల్ వేదికగా నిలవనుంది. వ్యూహాత్మక భాగస్వామి బర్వా బ్యాంక్ తో సహాయంతో బైట్ అల్-మషురా ఫైనాన్స్ కన్సల్టేషన్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ జరగనుంది. ఖతార్ ఒలంపిక్ కమిటీ స్పోర్ట్స్ పార్ట్ నర్ గా వ్యవహరించనుంది. ఖతార్ ఫైనాన్స్ కమిటీ డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. అంతర్జాతీయ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు, ఎకనామిక్స్, ఫైనాన్స్, స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లోని ఫైనాన్స్ ఇన్సిటిట్యూషన్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటాయి.
అంతర్జాతీయంగా వస్తున్న ఆర్ధిక సవాళ్లు, ఇస్లామిక్ ఫైనాన్స్ పై వాటి ప్రభావాలపై కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు. స్పోర్ట్స్ సెక్టార్ తో పాటు పలు కీలక విభాగాల్లో ఇస్లామిక్ ఫైనాన్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేసే అవకాశాలపై డిస్కస్ చేస్తారు. మిడిల్ ఈస్ట్ లో ఖనిజాలు, కమోడిటీస్ మార్కెట్ హబ్ ను క్రియేట్ చేయటంతో పాటు ఇస్లామిక్ ట్రేడింగ్ ఫ్లాట్ ఫామ్స్ గ్లోబల్ ఎకనామిపై ప్రభావం చూపే అవకాశాలపై కూడా 6వ దోహా ఇస్లామిక్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ చర్చించనుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..