'హౌడీ మోదీ' తరహాలోనే 'నమస్తే ట్రంప్'

- February 20, 2020 , by Maagulf
'హౌడీ మోదీ' తరహాలోనే 'నమస్తే ట్రంప్'

న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌లో జరగబోయే 'నమస్తే ట్రంప్' కార్యక్రమం అచ్చు అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' తరహాలో జరుగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని, ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 25 న మధ్యాహ్నం ట్రంప్ అహ్మదాబాద్ చేరుకుంటారని, అక్కడి నుంచి నేరుగా మోతేరా స్టేడియంకు చేరుకుని 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారని రవీశ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com