మస్కట్:మర్హాబా ట్యాక్సీ ధరల తగ్గింపు..

- February 21, 2020 , by Maagulf
మస్కట్:మర్హాబా ట్యాక్సీ ధరల తగ్గింపు..

మస్కట్:ఆన్ డిమాండ్ సర్వీస్ కు మార్హాబా ఎక్కువ మొత్తం ఛార్జీలు వేస్తోందని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తటంతో ఆ సంస్థ ఛార్జీలపై సమీక్షించుకుంది. ఆన్ డిమాండ్ సర్వీసు
ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. గురువారం(ఫిబ్రవరి 20) నుంచే తగ్గింపు ధరలు అమలులోకి వచ్చాయి. కొత్త ఛార్జీల ప్రకారం 800bz దగ్గర మీటరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆపై
ప్రతీ కిలోమీటర్ కు 150 bz ఛార్జ్ పడుతుంది. దీంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాలకు RO5 ఛార్జ్ పడుతుంది. ఉదాహారణకు రువి నుంచి మస్కట్ ఎయిర్ పోర్ట్ ఆన్
డిమాండ్ సర్వీస్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటే RO5 చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

రాబోయే కాలంలో గల్ఫ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కు వేదిక కాబోతున్నాయి. ఈ ఏడాదిలో దుబాయ్ ఎక్స్ పో 2020 జరగనుండగా..ఫిఫా వరల్డ్ కప్ 2022కి ఖతార్ వేదక కానుంది. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సహజకంగానే ఒమన్ కు కూడా విజిటర్స్ తాకిడి పెరుగుతుందని మార్హాబా అంచానా వేస్తోంది. ఒమన్ వచ్చే విజిటర్స్ ను దృష్టిలో ఉంచుకొని క్యాబ్ ఫేర్స్ ను తగ్గించినట్లు మార్హాబా ప్రాజెక్ట్ డైరెక్టర్ యూసుఫ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com