దుబాయ్ డ్యూటీ ఫ్రి టెన్నిస్ ఛాంపియన్ షిప్: నేడు టైటిల్ రేసులో సిమోనా హాలెప్ Vs ఎలెనా రిబాకినా

- February 22, 2020 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రి టెన్నిస్ ఛాంపియన్ షిప్: నేడు టైటిల్ రేసులో సిమోనా హాలెప్ Vs ఎలెనా రిబాకినా

దుబాయ్:ఉత్కంఠగా జరుగుతున్న దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో నేడు ఫైనల్ ఫైట్ జరగనుంది. క్లిష్టమైన డ్రాలో సత్తా చాటుతూ టైటిల్ రేసులో నిలిచిన కజకిస్తాన్ టాలెంటెడ్ ప్లేయర్ ఎలెనా రిబాకినా ఫైనల్స్ లో టాప్ సీడ్, మాజీ ఛాంపియన్ సిమోనా హాలెప్ తో తలపడనుంది. రోమానియన్ ప్లేయర్ సిమోనా హాలెప్ సెమీస్ లో జెన్నిఫర్ బ్రాడిపై 6-2, 6-0తో వరుస సెట్లలో ఈజీగా విక్టరీ సాధించి ఫైనల్ బెర్త్ కన్ఫమ్ చేసుకుంది.

మరోవైపు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్న రష్యన్ బోర్న్ కజకిస్తాన్ ప్లేయర్ ఎలెనా రిబాకినా ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు పొందింది. క్వార్టర్స్ లో సెకండ్ సీడ్ ప్లేయర్ కరోలినా ప్లిస్కోవా షాకిచ్చింది. తన కేరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిచే ఈ మ్యాచ్ లో 7-6(1), 6-3తో కరోలినా ప్లిస్కొవాను ఓడించి సెమీస్ చేరుకుంది. ఇక సెమీస్ లో ఎనిమిదో సీడ్ పెట్రా మార్టిక్ను 7-6 (5) 7-6 (2) తో ఓడించి టైటిల్ రేసుకు చేరుకుంది. కేరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న ఎలెనా రిబాకినా, టాప్ సీడ్ ప్లేయర్ తో తలపడుతుండటంతో ఫైనల్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ ఎవరు విజయం సాధిస్తారో అంచనాల వేయటం కూడా కష్టంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com