మరోసారి భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నా నాగ్ ..
- January 21, 2016
సీనియర్ హీరోలలో తన వయసుకు, ఇమేజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకోవటంలో ముందున్న హీరో కింగ్ నాగార్జున. మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలతో మంచి విజయాలు సాధించిన నాగ్ మరోసారి భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నాగార్జున త్వరలో వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు 'హాథీరాం బాబా'గా కనిపించనున్నాడు.శిరిడి సాయి సినిమా తరువాత ఇంతవరకు దర్శకుడు రాఘవేంద్రరావు మరో సినిమాను ప్రారంభించలేదు. వెంకటేశ్వర స్వామి కథతో ఓ సినిమా చేస్తున్నట్టుగా చాలాకాలం క్రితమే ప్రకటించినా, నాగార్జున డేట్స్ కాళీ లేకపోవటంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు.సోగ్గాడే చిన్నినాయనా తరువాత మరో సినిమా అంగీకరించని నాగ్, రాఘవేంద్రరావు దర్శకత్వంలో హాథీరాం బాబాగా నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









