దుబాయ్: బీఆర్ శెట్టి చుట్టు బిగిసిన ఆర్ధిక కష్టాలు..యూఎస్ సంస్థ సాయం కోరిన బిజినెస్ మెన్
- February 22, 2020
యూఏఈలో ఇండియన్ బిజినెస్ పర్సన్ బీఆర్ శెట్టి ఆర్ధిక కష్టాలను అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన వ్యాపార సామ్రాజ్యంలోని పలు సంస్థలను కష్టాల్లో నుంచి బయటపడేసేందుకు యూఎస్ సంస్థ హౌలిహాన్ లోకీ కన్సల్టెంట్ సంస్థను అప్రోచ్ అయ్యారు. ఈ సంస్థ శెట్టి కంపెనీల నిజమైన ఆస్తులను మదింపు చేసి వాటి నష్టాలకు దారి తీసిన పరిస్థితులను విశ్లేషించుకుంటుంది. అప్పులను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. అంతేకాదు అవసరమనుకుంటే శెట్టి వ్యాపారాల్లోని కొన్ని అసెట్స్ అమ్మే అవకాశాలను కూడా పరిశీలిస్తుంది. అమెరికన్ బేస్డ్ ఇన్వెస్మెంట్ బ్యాంక్ బీఆర్ఎస్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ తో కలిసి చేయనుంది. శెట్టి స్థాపించిన 30 కంపెనీల రుణాలను రీవ్యాంప్ చేసేలా వర్కౌట్ చేయనుంది. ట్రావెలెక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ను దక్కించుకునేందుకు చేసిన సుమారు 1 బిలియన్ డాలర్ల అప్పును కూడా సమీక్షించనుంది. అంతేకాదు లీగల్ ఇష్యూస్ నుంచి బయటపడేందుకు తన కంపెనీల్లో లావాదేవీలపై న్యాయపరమైన అంశాలను సమీక్షించాలని న్యాయ సంస్థ హెర్బర్ట్ స్మిత్ ఫ్రీహిల్స్ ను శెట్టి కోరటంతో ఆ సంస్థ ఇప్పటికే శెట్టి హెల్డింగ్స్ పై రివ్యూ ప్రారంభించింది.
1975లో అబుదాబిలో సొంతగా ‘ఎన్ఎంసీ హెల్త్' పేరిట ఒక మెడికల్ నెట్వర్క్ను కంపెనీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నియో ఫార్మా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని కూడా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్...గల్ఫ్తోపాటు ఇండియా, నేపాల్, ఆఫ్రికాలో ఉన్న హెల్త్ కేర్ ఫార్మా ‘బీఆర్ లైఫ్' ను విస్తరించారు. షెట్టికి చెందిన ఎన్ఎంసీ హెల్త్ 2012లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన తొలి అబుదాబి కంపెనీగా పేరు తెచ్చుకుంది. అయితే..తన సంస్థల షేర్ ల విలువను వాస్తవ విలువ కంటే ఎక్కువ చూపించినట్లు బ్లాక్స్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ అకౌంట్లపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన గత వారం NMC బోర్డ్ నుంచి తప్పుకున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







