రేగుపండ్లులో ఆరోగ్యాo
- January 21, 2016
రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్‌కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు.సంక్రాంతి పండుగ వస్తుందనడానికి సూచనగా పల్లెల్లో రేగుచెట్లు విరగకాస్తుంటాయి. దోరగా ... ఎర్రగా పండిన రేగుపండ్లు నోరూరిస్తూ వుంటాయి.దాంతో వంకీ కత్తిని తలపించే రేగిముళ్లను లెక్కచేయకుండా పిల్లలు రేగుపండ్లు కోసేస్తుంటారు. ఇక పట్టణాల్లో కూడా ఏ కూడలిలో చూసినా రేగుపండ్లు విరివిగా కనిపిస్తుంటాయి. తోపుడు బండ్ల చుట్టూచేరి రేగుపండ్లను విపరీతంగా కొనుగోలు చేయడం కనిపిస్తూ వుంటుంది.సంక్రాంతి సమయంలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను, వాకిట్లో వేసిన ముగ్గుమధ్యలో వుంచి వాటిపై రేగుపండ్లు ఉంచుతుంటారు. ఇక చిన్న పిల్లలకు రేగుపండ్లను భోగి పండుగ రోజున తలపై నుంచి పోస్తారు. ఈ వేడుకనే 'భోగిపండ్లు' అని అంటారు. ఈ విధంగా చేస్తే రేగుపండ్లు శరీరాన్ని తాకుతూ వెళ్లడం వలన వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయని అంటారు. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని ఆశించే దీనిని ఆచారాల్లో భాగంగా చేసి పెద్దలు ఈ వేడుకను జరుపుతుంటారు.రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది.పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధ గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.నిజంగానే రేగుపండులో అనేక రకాలైన ఔషధ గుణాలు వున్నాయని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. మరి రేగుపళ్లలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.రేగుపండ్లు తినడం వలన వాతము ... పైత్యము ... కఫము తగ్గుతాయి. ఇవి కడుపులో మంటను ఉపశమింపజేయడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతాయి. మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా, మూలవ్యాధి బారిన పడకుండా కాపాడతాయని చెప్పబడుతోంది.ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగిపండ్లతో చేసినా టానిక్‌ను ఎంచుకుంటారు.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది.అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్ వ్యతిరేకి, ఉపశమనకారి.ఇది రక్తాన్ని శభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణా మందులలో దీన్ని వాడతారు.విత్తనాలు కూడా అనేక ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి.ఇక రేగుపండ్లు తేనె రంగులో వున్నవి ... పండినవి మాత్రమే తినాలి. పచ్చి రేగుపండ్లు తినడం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









