ట్రాఫిక్ జరీమానాలపై 100 శాతం డిస్కౌంట్, మళ్ళీ వచ్చిందోచ్!
- February 24, 2020
దుబాయ్ పోలీస్, ట్రాఫిక్ ఫైన్ ఈనీషియేటివ్‌ని ఇంకోసారి ప్రకటించింది. జరీమానాలపై 100 శాతం డిస్కౌంట్ ఈ ఇనీషియేషన్ ప్రత్యేకత. ఫిబ్రవరి 6న మొదటి ఎడిషన్ పూర్తయిన వెంటనే, రెండో ఎడిషన్ అమల్లోకి వచ్చింది. గత ఏడాది ఈ ఇనీషియేషన్ ద్వారా 557,430 మంది మోటరిస్టులు జరీమానాల నుంచి ఉపశమనం పొందారు. కాగా, 546,970,930 దిర్హావ్‌ులు వాహనదారులకు మిగిలింది. కాగా, గత ఏడాది ట్రాఫిక్ మరణాలు 16 శాతానికి తగ్గాయి. మేజర్ ఇంజ్యురీస్ కూడా 38 శాతం తగ్గాయి. ఇదిలా వుంటే, ట్రాఫిక్ జరీమానాల డిస్కౌంట్ నుంచి 114,769 మంది పురుషులు, 444,661 మంది మహిళలు లబ్ది పొందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మొదటి మూడు నెలల్లో ఉల్లంఘనలకు పాల్పడకపోతే 25 శాతం, ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడనివారికి 50 శాతం డిస్కౌంట్, 9 నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడని పక్షంలో 75 శాతం, ఏడాది పాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే 100 శాతం అంతకు ముందు జరీమానాలపై డిస్కౌంట్ పొందేందుకు వాహనదారులకు అవకాశం కల్పిస్తున్నారు దుబాయ్ పోలీసులు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







