విజిట్‌ వీసా ఉల్లంఘనుల ట్రాన్సాక్షన్స్‌ బ్లాక్‌ అవుతాయ్‌!

- February 24, 2020 , by Maagulf
విజిట్‌ వీసా ఉల్లంఘనుల ట్రాన్సాక్షన్స్‌ బ్లాక్‌ అవుతాయ్‌!

కువైట్:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ అనాస్‌ అల్‌ సలెహ్‌, విజిట్‌ వీసా ఉల్లంఘనులకు సంబంఇంచి రెసిడెన్స్‌ ఎఫైర్స్‌ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ మేజర్‌ జనరల్‌ తలాల్‌ మారాఫికి స్పష్టమైన సూచనలు చేశారు. విజిట్‌ వీసాపై బంధువుల్ని తీసుకొచ్చి, అక్రమంగా దేశంలో నివసిస్తున్నారో వారికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్‌ రద్దు చేయాలన్నది ఈ సూచనల సారాంశం. ప్రూఫ్‌ ఆఫ్‌ డిపాచ్యుర్‌ని సంబంధిత డిపార్ట్‌మెంట్‌లో చూపించినప్పుడే బ్లాక్‌ చేసిన అకౌంట్లు లిఫ్ట్‌ చేయబడ్తాయని తెలుస్తోంది. బిజినెస్‌ లేదా విజిట్‌ వీసాలపై దేశానికి వచ్చేవారిలో కొందరు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశం విడిచి వెళ్ళడంలేదు. ఇలాంటివారి సంఖ్య 30,000కి పైగానే వుంటోంది. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు వుంటున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com