ఒమన్ కు విస్తరించిన కరోనా వైరస్..రెండు పాజిటీవ్ కేసులు నమోదు
- February 25, 2020
ఒమన్:ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. లేటెస్ట్ గా ఒమన్ లోనూ తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే..వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉందని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు ప్రకటించారు. దీంతో ఒమన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు సాధ్యమైనంత వకు ఇళ్లు వదిలి బయటికి రావొద్దని అధికారులు సూచించారు. అలాగే ఇరాన్ కు తక్షణమే ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్, కువైట్ లో కూడా తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన బహ్రెయిన్ వ్యక్తికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ నుంచి కువైట్ చేరుకున్న ముగ్గురు వైరస్ బారిన పడినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రి తెలిపింది. వైరస్ సోకిన ముగ్గురు సౌదీ పౌరులని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు