యూఏఈ:పెండింగ్ జీతాల చెల్లింపులో 762 మంది కార్మికులకు ఊరట
- February 25, 2020
యూఏఈ:బకాయి జీతాల కోసం నెలల తరబడి న్యాయపోరాటం చేస్తున్న 762 మంది కార్మికులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పెండింగ్ శాలరీల చెల్లింపు కోసం dh20 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా మొబైల్ కోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా కార్మికులు పోరాటం ఫలించిటనట్లైంది. పెండింగ్ జీతాల ఇష్యూను రీసాల్వ్ చేయటంలో దుబాయ్ లేబర్ కోర్టు, మినిస్ట్రి ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ ఎమిరైజేషెషన్ జోక్యం చేసుకోవటంతో సమస్యకు పరిష్కారం దొరికింది. వివరాల్లోకి వెళ్తే..ఓ క్యాటరింగ్ సంస్థ ఆర్ధిక ఒడిదుడుకులతో తమ కార్మికులకు జీతాలు చెల్లించటంలో విఫలమైంది. వెయిటర్స్, కుక్స్, అడ్మినిస్ట్రేటర్స్, డ్రైవర్స్ ఇలా దాదాపు 1000 మంది జీతాలు లేకుండా నెలల తరబడి పని చేశారు. చివరికి బకాయి జీతాల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే 300 మందికి జీతాలు చెల్లించేలా సమస్యను పరిష్కరించిన మొబైల్ కోర్టు..ఇప్పుడు మిగిలిన 762 మంది కార్మికుల రావాల్సిన శాలరీల చెల్లించాలని ఆదేశించింది. కార్మిక చట్టాల మేరకు వర్కర్స్ హక్కులను పరిరక్షిస్తామని జ్యూడిషియల్ అఫిషియల్స్ తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..