ట్రంప్ విందుకు వస్తున్నది వీరే

- February 25, 2020 , by Maagulf
ట్రంప్ విందుకు వస్తున్నది వీరే

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఇచ్చే విందు సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కొందరు కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులను ఆహ్వానించారు. విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలకు ప్రధాని ఇచ్చే విందుకు ఆహ్వానించారు.

ట్రంప్ పాల్గొనే విందులో రిలయెన్స్ పరిశ్రమల ఛైర్మన్ ముకేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహింద్రా, భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణి, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, ఎల్ అండ్ టి సీఈవో సుబ్రమణ్యన్, భారతి ఎంటర్ ప్రెజెస్ ఛైర్మన్ సునీల్ మిట్టల్, ఎల్ ఎన్ మిట్టల్, ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం బిర్లా, వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్, ఇన్పోసిస్ ఎండీ సలీల్ పరేఖ్, హిందూస్థాన్ యూనీలివర్ సీఈవో సంజీవ్ మెహతాలను ఆహ్వానించారు. ఈ విందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, కేంద్ర కార్యదర్శులు అజయ్ భల్లా, అమితాబ్ కాంత్, పీకే మిశ్రా, బిపిన్ రావత్ లను ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com