ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.!
- February 25, 2020_resources1_16a0854196e_large_1582629429.jpg)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఏర్పాటు చేసిన విందుకు కేసీఆర్ హాజరుకానున్నారు. సోమవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం నుంచి సీఎం హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ విందుకు కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిసా, కర్ణాటక, తమిళనాడు, అసోం, బిహార్, హరియాణా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చేందుకు కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశారు. పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటోను కేసీఆర్ అందించనున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోచంపల్లి, గద్వాల్ చీరలను.. మెలానియా, ఇవాంకకు బహూకరించేందుకు కేసీఆర్ స్పెషల్‌గా తయారు చేయించారు. గతంలో కూడా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇవాంకకు కేసీఆర్ ప్రత్యేక బహుమతి అందజేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..