'భీష్మ' విజయోత్సవ వేడుక
- February 25, 2020
ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ, వాటి వివరాల్లోకి వెళితే....
ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ, "ప్రి రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా 'భీష్మ'తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ విజన్ పర్ఫెక్టుగా ఉంటే 'భీష్మ'కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోలతో పోటీపడుతూ డాన్స్ చేస్తుంది. చక్కగా నటిస్తుంది. నితిన్ తో మేం 'శ్రీనివాస కల్యాణం'తో హిట్ కొట్టాలనుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ ఉంటే, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారని 'ప్రతిరోజూ పండగే', 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో', ఇప్పుడు 'భీష్మ' నిరూపించాయి" అని చెప్పారు.
దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, "నిర్మాతలు చినబాబు, వంశీ గార్లు, నితిన్.. నా స్క్రిప్టును నమ్మి 'భీష్మ'ను చేసే అవకాశం ఇచ్చారు. వాళ్లకు థాంక్స్. నా టెక్నీషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తియ్యగలిగాను. తను ఇదివరకు చేసిన పాత్రలకు చాలా భిన్నమైన పాత్రను ఈ మూవీలో సంపత్ రాజ్ చాలా బాగా చేశారు" అన్నారు.
హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ, "ఈ మూవీని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. క్రిటిక్స్ మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. 'భీష్మ' పాత్రలో నితిన్ ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డాను. మంచి మ్యూజిక్, చక్కని సినిమాటోగ్రఫీతో అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది. నాకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్" అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ, "సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్ తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. రష్మికతో కంటే సంపత్ రాజ్ తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. కాసర్ల, శ్రీమణి చాలా మంచి పాటలు ఇచ్చారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. 'అ ఆ'తో నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్ లోనే నాకు మళ్లీ హిట్ వచ్చింది. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!