తమిళ సినిమా 'ఖైదీ' రీమేక్ లో 'అజయ్ దేవగన్'
- February 25, 2020
ఈమధ్య దక్షిణాది సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్దపెద్ద బాలీవుడ్ హీరోలు సైతం ఆ సినిమాల రీమేక్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పలు సినిమాలు బాలీవుడ్ లోకి రిమేక్ అయ్యాయి. తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన తమిళ మూవీ 'ఖైదీ' మంచి విజయం సాధించడంతో ఆ సినిమాను బాలీవుడ్లో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ, డ్రీమ్ వారియర్స్‌తో కలిసి రీమేక్ చేసే పనిలో పడింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గణ్ చేస్తున్నట్లు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటికే ఆయనను సంప్రదించగా దానికి ఆయన ఓకే చెప్పాడట. మొన్నటి వరకు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ అనకున్నప్పటికీ ఈ అవకాశం అజయ్ దేవగన్ ఎగరేసుకు పోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ హీరో వరుస విజయాలు అందుకుంటున్నాడు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!