యూరోలు, దిరామ్స్ని కలిగిన ఓ వ్యక్తి అరెస్ట్..

- January 21, 2016 , by Maagulf
యూరోలు, దిరామ్స్ని కలిగిన ఓ వ్యక్తి అరెస్ట్..

 పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కలిగిన ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రూ. కోటి విలువ గల విదేశీ కరెన్సీ(యూరోలు, దిరామ్స్)ని కలిగిన ఓ వ్యక్తి ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఇంటలిజెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. కాగా కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి తన వెంట 5 వేల యూఎస్ డాలర్స్‌ను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. వీటితో పాటు మరో 5 వేల డాలర్ల విలువ గల బాండ్లు, చెక్స్‌ను తీసుకువెళ్లవచ్చు. పరిమితికి మించి నగదును తీసుకువెళ్తుండటంతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com